Malaysia Airlines MH370: 2014లో సముద్రంలో కూలిన మలేసియా విమానం ఎంహెచ్-370.. మళ్లీ అన్వేషణ

Malaysia Airlines MH370 Search Reopens After 2014 Crash
  • కౌలాలంపూర్‌లో మీడియా సమావేశంలో వెలల్డించిన ప్రధాని నజీబ్ రజాక్
  • ఉపగ్రహ సమాచారం ఆధారంగా శకలాల కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నట్లు వెల్లడి
  • మిషన్ కోసం 'ఆర్మడ' నౌక సెర్చ్ ఏరియా ప్రాంతానికి వచ్చిందన్న మంత్రి
మలేషియా విమానం ఎంహెచ్ 370 పదకొండేళ్ల క్రితం, 2014 మార్చి 8న దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిన విషయం విదితమే. ఈ విమానం ఆచూకీ కోసం మలేషియా మరోసారి అన్వేషణ ప్రారంభించింది. ఈ మేరకు కౌలాలంపూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ఈ ప్రకటన చేశారు. ఉపగ్రహ సమాచారం ఆధారంగా శకలాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

239 మందితో కూడిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 సముద్రంలో కూలిపోయి దశాబ్దం పైగా గడిచిన అనంతరం, ఇప్పుడు మరోసారి గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మిషన్ కోసం 'ఆర్మడ' నౌక ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలోని క్వినానా యాంకరేజ్ నుంచి బయలుదేరి సెర్చ్ ఏరియాకు చేరుకున్నట్లు మలేషియా రవాణా మంత్రి వెల్లడించారు.

2014లో సముద్రంలో కూలిన ఈ విమానంలో ఐదుగురు భారతీయులు, పలువురు ఎయిర్‌లైన్స్ సిబ్బంది సహా 239 మంది ఉన్నారు. బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ విమానం గల్లంతై పదేళ్లు దాటినా ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి అన్వేషణ ప్రారంభిస్తున్నట్లు మలేషియా ప్రకటించింది.
Malaysia Airlines MH370
MH370
Malaysia plane crash
Najeeb Razak
South Indian Ocean
Boeing

More Telugu News