Meenakshi Chaudhary: సంక్రాంతి బ్యూటీకి సక్సెస్ ఖాయమంటున్న ఫ్యాన్స్!

Meenakshi Chaudhary Special
  • స్పీడ్ పెంచుతున్న మీనాక్షి చౌదరి
  • రెండేళ్లుగా సంక్రాంతి బరిలో కనిపిస్తున్న సుందరి 
  • సంక్రాంతి బ్యూటీగా పెరుగుతున్న క్రేజ్
  • 2026 సంక్రాంతి బరిలోను దిగుతున్న భామ  
  • సక్సెస్ ఖాయమంటున్న ఫ్యాన్స్

హీరోయిన్ గా ఎంట్రీతోనే హిట్ కొట్టకపోతే ఆ హీరోయిన్ కెరియర్ పుంజుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకూ నిదానంగా సినిమాలు చేస్తూ .. సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేయవలసిందే. ఈ లోగా వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్స్ ధాటిని తట్టుకుని నిలబడాల్సిందే. మీనాక్షి చౌదరి ఆ పని చేయడం వల్లనే ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. 2026 సంక్రాంతి బరిలో 'అనగనగా ఒక రాజు' సినిమాతో దిగుతోంది. నవీన్ పోలిశెట్టి జోడీగా ఆమె నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా 'మారి' పరిచయమవుతున్నాడు.

2024 - 2025 ఈ రెండేళ్లు మీనాక్షి చౌదరికి చాలానే హెల్ప్ చేశాయని చెప్పాలి. 2024లో ఆమె ఇక్కడ మహేశ్ బాబు తోను .. కోలీవుడ్ లో విజయ్ తోను సినిమాలు చేసింది. అలాగే దుల్కర్ తో 'లక్కీ భాస్కర్' చేసింది. ఇలా ఒకే ఏడాదిలో ముగ్గురు స్టార్ హీరోలతో చేసిన సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మహేశ్ బాబుతో చేసిన 'గుంటూరు కారం' సినిమా 2024 సంక్రాంతి బరిలో నిలిచి భారీ వసూళ్లను సాధించింది. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి ఆమె 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. 

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో గ్లామర్ పరంగా .. నటన పరంగా కూడా మీనాక్షి మరిన్ని మార్కులు కొట్టేసింది. సంక్రాంతి బ్యూటీగా యూత్ కి మరింత చేరువైంది. అలాంటి మీనాక్షి చౌదరి మళ్లీ ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' సినిమాతో 2026 జనవరిలో ఆడియన్స్ ను పలకరించనుంది. గట్టిపోటీ మధ్య ఈ సినిమా విడుదలవుతోంది. సంక్రాంతి సెంటిమెంట్ ఈసారి కూడా ఆమెకి కలిసిరావడం ఖాయమనేది ఫ్యాన్స్ మాట. ఇక చైతూ జోడీగా ఆమె చేస్తున్న 'వృషకర్మ' లైన్లో ఉన్న సంగతి తెలిసిందే.  

Meenakshi Chaudhary
Anaganaga Oka Raju
Sankranthi
Naveen Polishetty
Guntur Kaaram
Vijay
Lucky Bhaskar
Vrisha Karma

More Telugu News