Nara Lokesh: "ఏ ఫర్ ఆంధ్రా"... 'మనీకంట్రోల్' ఇదే చెబుతోంది: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Hails Andhra Pradesh Recognition in Moneycontrol Report
  • మనీకంట్రోల్ 2025 టెక్ అండ్ స్టార్టప్ గైడ్ విడుదల
  • ఏ-జడ్ లిస్ట్‌లో 'ఏ' ఫర్ ఆంధ్రా అంటూ ఏపీకి ప్రత్యేక గుర్తింపు
  • ఇండియాస్ న్యూ టెక్ డార్లింగ్ ఏపీనే అన్న మంత్రి నారా లోకేశ్
  • రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి ఇది నిదర్శనమని ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర సాంకేతిక ప్రగతిపై హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్థిక వార్తా సంస్థ మనీకంట్రోల్ విడుదల చేసిన '2025 టెక్ అండ్ స్టార్టప్ గైడ్'లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన ప్రత్యేక గుర్తింపును ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

2025 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, మనీకంట్రోల్ సంస్థ ఈ ఏడాది దేశంలోని టెక్నాలజీ, స్టార్టప్ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై 'ఏ టు జడ్' (A-Z) పేరుతో ఒక ప్రత్యేక నివేదికను రూపొందించింది. ఇందులో ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం ఒక్కో అక్షరానికి ఒక్కో ట్రెండ్‌ను లేదా అంశాన్ని జోడించారు. ఈ జాబితా 'ఏ' (A) అక్షరంతో మొదలవ్వగా.. దానికి 'ఏ ఫర్ ఆంధ్రా' (A for Andhra) అని నామకరణం చేయడం విశేషం.

దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. "2025 ఏ టు జడ్ జాబితా ఆంధ్రా పేరుతో మొదలైంది. భారతదేశపు నూతన టెక్ డార్లింగ్‌గా (India's new tech darling) ఆంధ్రా అవతరించింది. భవిష్యత్తును నడిపించే శక్తిగా రాష్ట్రం ఎదుగుతోంది" అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మారుతున్న టెక్నాలజీ ముఖచిత్రానికి, పెరుగుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశీయ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక శక్తిగా మారుతోందని, పెట్టుబడులకు, ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్ర బిందువుగా నిలుస్తోందని మనీకంట్రోల్ కథనం పేర్కొన్నట్లు సమాచారం. ఈ గుర్తింపు పట్ల ఐటీ వర్గాల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది.
Nara Lokesh
Andhra Pradesh
Moneycontrol
AP IT Minister
2025 Tech Startup Guide
India Tech Darling
Startup Ecosystem
AP Technology
Andhra Investments

More Telugu News