Hrithik Roshan: నా బొటనవేలితో చేయలేని రెండో పని అదే: హృతిక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hrithik Roshan Reveals Interesting Fact About His Double Thumb
  • తనకు ఒకే చేతికి రెండు బొటనవేళ్లు ఉన్నాయన్న హృతిక్
  • చేతితో హార్ట్ సింబల్ సరిగా పెట్టలేకపోతున్నానని వెల్లడి
  • డబుల్ థంబ్ వల్లే ఇది సాధ్యం కావడం లేదంటూ సరదా వ్యాఖ్యలు
  • గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు
  • సోషల్ మీడియాలో హృతిక్ షేర్ చేసిన షాడో ఫొటోలు
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన చేతికున్న అదనపు బొటనవేలు (డబుల్ థంబ్) గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన, సరదా వ్యాఖ్య చేశారు. తన చేతులతో పర్ఫెక్ట్ 'హార్ట్ షేప్' (లవ్ సింబల్) ఎందుకు పెట్టలేకపోతున్నారో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది తనకు సంబంధించిన 'బిగ్ రెవలేషన్' (పెద్ద విషయం బయటపెట్టడం) అంటూ చమత్కరించారు.

2025 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో హృతిక్ తన గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఇందులో వారిద్దరి నీడలు (Silhouettes) మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన రాస్తూ.. "హ్యాపీ షాడోస్ మాతో పాటు డ్యాన్స్ చేస్తున్నాయి. 2025 చాలా సంతోషంగా ముగుస్తోంది. నా అభిమానులందరికీ ప్రేమను పంచుతున్నా. రాబోయే కొత్త సంవత్సరాన్ని మీకే అంకితం చేస్తున్నా" అని పేర్కొన్నారు.

ఇదే పోస్టులో చివరగా ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. "నా చేతులతో హార్ట్ సింబల్ సరిగ్గా పెట్టలేకపోవడం అనేది.. నాకు ఒకే చేతికి రెండు బొటనవేళ్లు (డబుల్ థంబ్) ఉండడం వల్ల నేను చేయలేని రెండో పని మాత్రమే" అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, గత కొన్ని వారాలుగా హృతిక్ రోషన్ తన కజిన్ వివాహ వేడుకల్లో సందడి చేస్తున్నారు. సబా ఆజాద్, తన ఇద్దరు కుమారులు హృహాన్, హృదాన్‌లతో కలిసి ఆయన పెళ్లిలో పాల్గొన్నారు. అక్కడి సంగీత్ వేడుకలో తన కొడుకులతో కలిసి 'ఓ హో హో హో' పాటకు హృతిక్ వేసిన డ్యాన్స్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియోను చూసిన హృతిక్ తల్లి పింకీ రోషన్.. తన కొడుకు, మనవళ్లు కలిసి డ్యాన్స్ చేయడం చూసి చాలా ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. పిల్లలను సంస్కారవంతంగా పెంచారంటూ వారి తల్లి సుసాన్‌ను కూడా ఆమె ప్రశంసించారు.
Hrithik Roshan
Hrithik Roshan double thumb
Hrithik Roshan revelation
Saba Azad
Bollywood
Hrithik Roshan dance video
Hrithik Roshan family
Hrithik Roshan cousin wedding

More Telugu News