Bunny Vasu: ఆ రోజున అలా మాట్లాడకుండా ఉండాల్సింది: బన్నీ వాసు

Bunny Vasu Interview
  • నిర్మాతగా బన్నీవాసుకి మంచి పేరు 
  • 'మిత్రమండలి' నష్టాల గురించిన ప్రస్తావన
  • 6 కోట్ల నష్టం తెచ్చిపెట్టిందని వ్యాఖ్య  
  • తన అంచనాలు తప్పాయని వెల్లడి
  • అందుకే హద్దులు దాటానని వివరణ  

బన్నీ వాసు .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చిన పేరు. నిర్మాతగా ఆయన తనదైన మార్క్ చూపిస్తూ వెళుతున్నారు. చిన్న సినిమాలతోనే పెద్ద విజయాలను అందుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నారు. ఒక సినిమా సక్సెస్ ను అంచనా వేయడంలో ఆయనకి మంచి అనుభవం ఉందని అందరూ నమ్ముతుంటారు. అలాంటి బన్నీ వాసు 'మిత్రమండలి' అనే సినిమా విషయంలో రెండు పొరపాట్లు చేశారనే ఒక టాక్ కాస్త బలంగానే వినిపించింది. 

తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న బన్నీవాసుకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ, 'మిత్రమండలి' సినిమా విషయంలో నా అంచనా తప్పు అయిందనే చెప్పాలి. ఫస్టు కాపీ చూసుకోవలసిన సమయంలో నేను ఇక్కడ లేకపోవడం కూడా అందుకు కారణంగా చెప్పుకోవాలి. అందువలన ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నాకు అనిపించిందే చెప్పాను. తప్పు ఎక్కడ జరిగిందనేది, థియేటర్లో  సినిమా చూస్తున్నప్పుడే, నాకు అర్థమైంది. ఆ సినిమా వలన 6 కోట్ల నష్టం వచ్చింది" అని అన్నారు. 

" ఇక 'మిత్రమండలి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో మాటల పరంగా కూడా నేను కాస్త లిమిట్ దాటడం జరిగింది. ఆ తరువాత ఆ విషయాన్ని గురించి అరవింద్ గారు కూడా నాతో మాట్లాడారు. ఆ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసిన ఒక వ్యక్తికి అంతకుముందే హార్ట్ ఎటాక్ రావడం, ఈ సినిమా విడుదలకి ముందే కొంతమంది నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడం గురించి వినడం జరిగింది. అందువల్లనే ఆ రోజున స్టేజ్ పై అలా మాట్లాడాను. ఇకపై అలా హద్దులు దాటకూడదని మాత్రం బలంగా నిర్ణయించుకున్నాను" అని చెప్పారు. 

Bunny Vasu
Mitra Mandali
Allu Aravind
Telugu cinema
Film producer
Movie review
Movie loss
Pre release event
Heart Attack
Negative talk

More Telugu News