Jairam Ramesh: భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలపై చైనా వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్

Jairam Ramesh Criticizes Modis Silence on Chinas Remarks on India Pakistan Conflicts
  • భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నివారణకు తామే మధ్యవర్తిత్వం వహించామన్న చైనా
  • చైనా ప్రకటనను ఖండించిన భారత ప్రభుత్వ వర్గాలు
  • నిన్న ట్రంప్, నేడు చైనా అదే ప్రకటన చేస్తున్నప్పటికీ మోదీ మాట్లాడటం లేదని విమర్శ
భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల పరిష్కారానికి తామే మధ్యవర్తిత్వం వహించామని ఇదివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనగా, ఇప్పుడు చైనా సైతం అదే తరహా ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదని ఆ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు తామే మధ్యవర్తిత్వం నెరిపినట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో జైరామ్ రమేశ్ స్పందిస్తూ ఈ విమర్శలు చేశారు.

భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలను తానే ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ పలు అంతర్జాతీయ వేదికలపై ప్రకటించారని, దాదాపు 65 సార్లు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారని జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మౌనం వీడలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి కూడా అదే ప్రకటన చేయడం అనేక సందేహాలకు తావిస్తోందని ఆయన అన్నారు.
Jairam Ramesh
India Pakistan conflict
China mediation
Narendra Modi
Donald Trump
Congress Party
Wang Yi
Indo Pak tensions

More Telugu News