ఉక్రెయిన్‌లో బఫర్‌ జోన్‌ విస్తరించండి: పుతిన్ ఆదేశాలు

  • ఉక్రెయిన్‌పై కీలక నిర్ణయం తీసుకున్న పుతిన్
  • భద్రతా బఫర్ జోన్ విస్తరించే దిశగా ఆదేశాలుమ
  • ముందుకు సాగుతున్న రష్యా బలగాలు

కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌పై భారీ దాడులు చేస్తున్న రష్యా... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన మరింత భూభాగాన్ని ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి సైన్యానికి ఉక్రెయిన్ భూభాగంలో ‘భద్రతా బఫర్ జోన్’ను విస్తరించమని ఆదేశాలు వచ్చాయని రష్యా సైనిక జనరల్ వాలేరి గెరసిమోవ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో, సుమీ, ఖర్కీవ్ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలను ఆక్రమించేందుకు రష్యా సైన్యాలు ముందుకు సాగనున్నాయి.


మరోవైపు, పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పుతిన్ ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సరిహద్దుల్లో ఉక్రెయిన్ చొరబాట్లకు అడ్డుపడేలా భద్రతా బఫర్ జోన్ ఏర్పాటు చేయాలనేది పుతిన్ నిర్ణయం. ఇటీవల ఉక్రెయిన్ సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్‌ చేసింది. పుతిన్ ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం, బఫర్ జోన్‌ను మరింత విస్తరించడం కోసం సైన్యాలు ముందుకు కదలనున్నాయి.


ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, పరస్పర దాడులు ఆగడం లేదు. రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ప్రకారం, ఉక్రెయిన్ తాజాగా 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సరిహద్దుల్లో సాంకేతిక, భౌగోళిక మార్పులపై మరిన్ని ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంది.



More Telugu News