Echo Movie: లొకేషన్స్ కోసమైనా చూడవలసిన మిస్టరీ థ్రిల్లర్ ఇది!

Eko Movie Update
  • మలయాళంలో హిట్ కొట్టిన సినిమా 
  • 5 కోట్లతో 50 కోట్లు కొల్లగొట్టిన కంటెంట్
  • ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలు
  • ఆద్యంతం కట్టిపడేసే లొకేషన్స్
  • జనవరి 7నుంచి తెలుగులోను అందుబాటులోకి  

మలయాళంలో ఈ నవంబర్లో విడుదలైన సినిమానే 'ఎకో'. దింజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన మొత్తం 5 కోట్లు మాత్రమే కావడం ఇక్కడి విశేషం. అలాంటి ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ రోజున 'నెట్ ఫ్లిక్స్' తెరపైకి వచ్చేసింది. అయితే అది కూడా కేవలం మలయాళంలో మాత్రమే. 

నిజానికి ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషలలో కూడా స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వచ్చాయి. అయితే మిగతా భాషలలో జనవరి 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని అధికారికంగా తెలియజేశారు. మలయాళ భాష తెలియకపోయినా ఈ  సినిమా చూడొచ్చు. కథాకథనాలతో పాటు అద్భుతమైన లొకేషన్స్ కనువిందు చేస్తాయి. లొకేషన్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చుననే ఒక ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. 

కథ విషయానికి వస్తే .. అటు ఫారెస్ట్ .. ఇటు కొండ ప్రాంతం కలిసిన చిన్న విలేజ్ ను ఆనుకుని ఉన్న ఒక ఎస్టేట్ అది. ఆ ఎస్టేట్ కి అధిపతి కురియాచన్. ఎస్టేట్ లో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం అతను చాలా కుక్కలు పెంచుతుంటాడు. అలాంటి కురియాచన్ హఠాత్తుగా కనిపించకుండా పోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కోసం మోహన్ వస్తాడు. కురియాచన్ ఏమైపోయాడు? అతనిని వెతుక్కుంటూ వచ్చిన మోహన్ ఎవరు? అనేది మిగతా కథ.   

Echo Movie
Dinjith Ayyathan
Malayalam Movie
Netflix
Mystery Thriller
OTT Release
Kuriachan
Mohan
Kerala Locations

More Telugu News