Suvarna Raju: చంద్రబాబు కేసుల తీర్పు ప్రతులు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సువర్ణరాజు
- చంద్రబాబు కేసుల తీర్పు ప్రతులను పొందేందుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు యత్నం
- ఆయన విన్నపాన్ని తిరస్కరించిన సీబీఐ కోర్టు
- దీంతో హైకోర్టును ఆశ్రయించిన సువర్ణరాజు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై గతంలో నమోదైన కేసుల తీర్పు ప్రతులను పొందేందుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులకు సంబంధించిన వివరాలను సమర్పించమని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం, విచారణను వారం రోజుల వరకు వాయిదా వేసింది.
కేసుల వివరాల్లోకి వెళితే... గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్ సంబంధిత కేసులు నమోదు చేసింది. వీటిలో ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు రద్దు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా సీఐడీ ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ని కారణంగా చూపుతూ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో, సువర్ణరాజు ఈ కేసుల రికార్డులు, తీర్పు ప్రతులను తనకు అందించమని అడిగినా, ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.