తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ

  • బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ కె. రామకృష్ణారావు
  • నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, నిజామాబాద్ కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి నియామకం
  • జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా జి. శ్రీజన, టి. వినయ్‌ కృష్ణారెడ్డిల నియామకం
తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇలా త్రిపాఠిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్‌ ప్రసాద్ నియమితులయ్యారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అదనపు కమిషనర్లుగా జి. శ్రీజన, టి. వినయ్ కృష్ణారెడ్డిలను ప్రభుత్వం నియమించింది.

మరోవైపు వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. వివిధ హోదాల్లో ఉన్న 21 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులను పలు డివిజన్లకు నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ రూరల్ ఏజేసీగా రాజేశ్ కుమార్, పంజాగుట్ట ఏజేసీగా సుధామల్లు రజిని, సికింద్రాబాద్ ఏజేసీగా శ్రీలక్ష్మి మంగళదీప్తిని నియమించారు. 


More Telugu News