Asim Munir: సీక్రెట్ గా అసిమ్ మునీర్ కుమార్తె వివాహం

Asim Munirs Daughters Wedding Held Secretly
  • పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుమార్తె మహనూర్ వివాహం
  • రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో అత్యంత రహస్యంగా వేడుక
  • హాజరైన పాక్ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్
  • భద్రతా కారణాల దృష్ట్యా ఫొటోలేవీ విడుదల చేయని కుటుంబం
  • మరోవైపు పాక్ మిలిటరీ తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన అంతర్జాతీయ నివేదికలు
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె మహనూర్ వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో జరిగింది. ఈ వేడుకకు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్ సహా పలువురు మాజీ జనరల్స్, ఐఎస్ఐ చీఫ్ హాజరయ్యారు. దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులు హాజరైనప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివాహ వేడుకను అత్యంత రహస్యంగా, నిరాడంబరంగా నిర్వహించారు. వేడుకకు సంబంధించిన ఫొటోలేవీ కుటుంబ సభ్యులు అధికారికంగా విడుదల చేయలేదు.

అసిమ్ మునీర్ కు వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి కుమారుడైన అబ్దుల్ రెహ్మాన్‌తో మహనూర్ వివాహం జరిగింది. వరుడు అబ్దుల్ రెహ్మాన్‌ గతంలో పాక్ ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేసి, అనంతరం ఆర్మీ కోటా ద్వారా సివిల్ సర్వీసెస్‌లో చేరి ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్థానీ జర్నలిస్ట్ జాహిద్ గిష్కోరి తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం 400 మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అసిమ్ మునీర్‌కు నలుగురు కుమార్తెలు కాగా.. ఇది ఆయన మూడో కుమార్తె వివాహం.
Asim Munir
Pakistan Army Chief
Mahnur Asim Munir
Pakistan wedding
Rawalpindi
Asif Ali Zardari
Shehbaz Sharif
Abdul Rehman
ISI Chief

More Telugu News