Financial Changes 2026: జనవరి 1 నుంచి అమలుకానున్న ఆర్థిక మార్పులివే..!

Financial Changes 2026 Impacting Common Man From January 1
  • జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న 8వ వేతన సంఘం
  • పాన్-ఆధార్ లింక్ చేయకపోతే నిలిచిపోనున్న సేవలు
  • వారానికి ఒకసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేసేలా నిబంధనలు
  • పీఎం కిసాన్ కొత్త లబ్ధిదారులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి
  • గ్యాస్ ధరలు, ఐటీ రిటర్నుల విధానంలోనూ మార్పులు
మరో రెండు రోజుల్లో 2025 సంవత్సరం ముగిసి, 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జనవరి 1 నుంచి సామాన్యుడి జేబుపై, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై, రైతుల సంక్షేమ పథకాలపై ప్రభావం చూపే అనేక కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బ్యాంకింగ్, పన్ను విధానాలు, గ్యాస్ ధరలు వంటి అంశాల్లో వస్తున్న ఈ మార్పులను ప్రజలు గమనించాల్సి ఉంది.

పాన్-ఆధార్ అనుసంధానం కీలకం
ప్రధానంగా పాన్-ఆధార్ అనుసంధానం అత్యంత కీలకం కానుంది. ఇప్పటికీ వీటిని లింక్ చేయని వారి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. బ్యాంకింగ్ సేవలు, పన్ను రిఫండ్లు నిలిచిపోకుండా ఉండాలంటే తక్షణం ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే. 

ఇక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తగా, 2025 డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం గడువు ముగియనుండటంతో జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

క్రెడిట్ స్కోర్ అప్డేట్
బ్యాంకింగ్ రంగంలో మరో ప్రధాన మార్పు క్రెడిట్ స్కోర్ అప్డేట్. ఇప్పటివరకు 15 రోజులకోసారి జరిగే ఈ ప్రక్రియ, ఇకపై ప్రతి వారం జరగనుంది. దీనివల్ల లోన్ రీపేమెంట్లలో ఏ చిన్న జాప్యం జరిగినా వెంటనే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. 

పీఎం కిసాన్ పథకంలో కొత్తగా చేరే రైతులకు 'ఫార్మర్ ఐడీ' తప్పనిసరి చేశారు. జనవరి 1 నుంచి కొత్త దరఖాస్తుదారులు ఈ డిజిటల్ ఐడీ ద్వారానే రూ.6,000 సాయం పొందేందుకు అర్హత సాధిస్తారు.

యూపీఐ లావాదేవీలు, సిమ్ వెరిఫికేషన్ నిబంధనలు మరింత కఠినతరం
వీటితో పాటు 2026 జనవరి నుంచి వచ్చే కొత్త ఐటీఆర్ ఫారాల్లో బ్యాంకింగ్, ఖర్చుల వివరాలు ప్రీ-ఫిల్ అయి రానున్నాయి. అలాగే, ప్రతి నెల మొదటి తేదీన జరిగే ఎల్‌పీజీ, విమాన ఇంధన ధరల సవరణ కూడా జరగనుంది. 

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు యూపీఐ లావాదేవీలు, సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం కో-లెండింగ్ (Co-lending) విధానంలోనూ మార్పులు రానున్నాయి.
Financial Changes 2026
PAN Aadhaar Link
8th Pay Commission
Credit Score Update
PM Kisan Scheme
Farmer ID
UPI Transactions
LPG Price Hike
ITR Forms
RBI Co-lending

More Telugu News