Khushi Mukherjee: క్రికెటర్లతో డేటింగ్ నాకు ఇష్టం లేదు.. సూర్యకుమార్ మెసేజ్‌లు చేసేవాడు: నటి ఖుషీ ముఖర్జీ

Suryakumar Yadav Used To Message Me A Lot says Bollywood Actress Drops Bombshell
  • సూర్యకుమార్ యాదవ్ తనకు మెసేజ్‌లు చేసేవాడ‌న్న‌ నటి  
  • సూర్యతో ఇప్పుడు మాట్లాడటం లేదని వెల్ల‌డి
  • క్రికెటర్లతో డేటింగ్ లేదా లింక్-అప్స్ తనకు ఇష్టం లేదన్న ఖుషీ ముఖర్జీ
  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్య దంపతులు
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై బాలీవుడ్ నటి, ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా ఫేమ్ ఖుషీ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిడ్డాన్ ఎంటర్టైన్మెంట్ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ గతంలో తనకు తరచుగా మెసేజ్‌లు చేసేవాడ‌ని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తాము మాట్లాడుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఏ క్రికెటర్‌తోనైనా డేటింగ్ చేయాలనుకుంటున్నారా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. "నాకు క్రికెటర్లతో డేటింగ్ చేయడం ఇష్టం లేదు. చాలా మంది క్రికెటర్లు నా వెనుక పడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా నాకు చాలా మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేం మాట్లాడుకోవడం లేదు. అతడిని కలవడం కూడా నాకు ఇష్టం లేదు. అనవసరపు లింక్-అప్స్ నాకు నచ్చవు" అని ఖుషీ ముఖర్జీ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు స్పందించలేదు.

ఇదిలా ఉంటే.. ఇవాళ‌ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యకుమార్ యాదవ్ తన అర్ధాంగి దేవిశాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. టీటీడీ అధికారులు వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన సూర్య దంపతులు వైకుంఠ ద్వారం గుండా నడిచి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇక‌, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను సూర్య సేన‌ 3-1తో గెలుచుకున్న విష‌యం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. 2024లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్, మరోసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.
Khushi Mukherjee
SuryaKumar Yadav
Bollywood actress
Indian cricketer
dating rumors
T20 captain
MTV Splitsvilla
Tirumala temple
Vaikunta Ekadasi
India vs New Zealand

More Telugu News