Roja: కూతురు అన్షు గురించి జరుగుతున్న ప్రచారంపై రోజా స్పందన

Roja responds to rumors about daughter Anshu
  • రోజా కూతురు స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళుతోందంటూ ప్రచారం
  • ఆ స్టార్ ఎవరో చెబితే తాను కూడా తెలుసుకుంటానన్న రోజా
  • తన కూతురు సైంటిస్ట్ కావాలనుకుంటోందని వెల్లడి

రాజకీయ వేదికపై ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా... తాజాగా తన కుమార్తె అన్షు మాలికపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు తెర దించారు. అన్షు ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళుతోందని, హీరోయిన్ గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందని... ఇలా అనే రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై రోజా తాజాగా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు.


అన్షుకు నటి కావాలనే కోరిక లేదని రోజా తెలిపారు. ఆమె సైంటిస్ట్ కావాలనుకుంటోందని, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారిస్తోందని చెప్పారు. ఇటాలియన్ భాష కూడా నేర్చుకుంటోందని తెలిపారు. పిల్లలపై తాను ఎలాంటి ఒత్తిడి పెట్టనని, వాళ్ల భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందని చెప్పారు. ఒక స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతోందనే ప్రచారంపై స్పందిస్తూ... ఆ స్టార్ ఎవరో చెబితే తాను కూడా తెలుసుకుంటానని నవ్వుతూ సమాధానమిచ్చారు.
Roja
Anshu Malika
YSRCP
actress Roja
Telugu News
Andhra Pradesh politics
Anshu rumors
Tollywood
celebrity daughter

More Telugu News