Mammootty: ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ .. 'కలంకావల్'

Kalamkaval Movie Update
  • మలయాళంలో హిట్ కొట్టిన 'కలంకావల్'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ   
  • నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించిన మమ్ముట్టి
  • జనవరిలో ఓటీటీకి వస్తున్న కంటెంట్  

మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలో 'కలంకావల్' ముందు వరుసలో కనిపిస్తుంది. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి జితిన్ కె జోస్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మమ్ముట్టి నటన గురించి మరోసారి అంతా మాట్లాడుకునేలా చేసిన సినిమా ఇది. 

ఈ సినిమా విడుదలైన 17 రోజులలోనే 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో ఇది ఒకటిగా నిలిచింది. మమ్ముట్టి కెరియర్లో చాలా వేగంగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాగా కూడా ఒక కొత్తరికార్డును ఈ సినిమా దక్కించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది. జనవరిలో ఈ సినిమా 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ కానుంది.  
 
మమ్ముట్టి తన కెరియర్లో చాలా అరుదుగా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేశారు. చాలా గ్యాప్ తరువాత ఆయన ఆ తరహా పాత్రను చేసింది ఈ సినిమాలోనే. కేరళ - తమిళనాడు ప్రాంతంలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ సైనేడ్ మోహన్ కథ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. 'జైలర్' విలన్ వినాయకన్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించాడు. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. హిందీ భాషలలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. 

Mammootty
Kalankavu
Kalankavu movie
Malayalam crime thriller
Jithin K Jose
Vinayakan
OTT release
SonyLIV
Malayalam cinema
Crime thriller movie

More Telugu News