Swiggy: స్విగ్గీ, జొమాటోలను మర్చిపోలేకపోతున్నా.. విదేశీయుడి వైరల్ వీడియో

Foreigner Misses Swiggy Zomato After Leaving India
  • భారతీయుల నిత్యజీవితంతో పెనవేసుకుపోయిన క్విక్ కామర్స్ సంస్థలు
  • ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలో గుమ్మం వద్దకు డెలివరీ
  • కరివేపాకు నుంచి ఐఫోన్ దాకా అన్నీ నిమిషాల్లోనే తెచ్చిస్తున్న డెలివరీ సంస్థలు
క్విక్ కామర్స్ కంపెనీల ఎంట్రీ తర్వాత భారతీయుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. వంటింట్లోని సరుకులతో పాటు స్మార్ట్ ఫోన్ల దాకా.. ఏదైనా సరే ఆర్డర్ చేసిన నిమిషాల్లో ఇంటి గుమ్మం ముందుకు డెలివరీ అవుతోంది. కరివేపాకు నుంచి లేటెస్ట్ ఐఫోన్ వరకూ.. అన్నీ నిమిషాల్లోనే అందుకుంటున్నాం. ఈ సదుపాయాలకు అలవాటు పడ్డ యువత విదేశాలకు వెళ్లినప్పుడు ఇంట్లో వాళ్లకన్నా వీటినే ఎక్కువగా మిస్సవుతున్నట్లు ఓ వ్లాగర్ చెప్పుకొచ్చాడు.

కొంతకాలం భారత దేశంలో ఉన్న తనకు అక్కడి నుంచి తిరిగి వచ్చాక క్విక్ కామర్స్ యాప్ లు, వాటి సేవలను మర్చిపోవడం కష్టంగా మారిందన్నాడు. భారత్ లోని తాజ్ మహల్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కాకుండా బ్లింకిట్, స్విగ్గీమార్ట్, జొమాటో వంటి యాప్ లు, వాటి ద్వారా పొందే సేవలను ఎక్కువగా కోల్పోతున్నట్లు చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది.
Swiggy
Zomato
Blinkit
Quick Commerce
India
Indian Culture
Food Delivery
Online Shopping
Viral Video
Expat Life

More Telugu News