Mohanlal: మోహన్ లాల్ ను ఆలోచనలో పడేసిన 'వృషభ'

Vrusshabha Movie Update
  • మోహన్ లాల్ నుంచి వచ్చిన 'వృషభ'
  • తొలిరోజున కనిపించని వసూళ్ల సందడి 
  • ఆయన కెరియర్లో అతి తక్కువ ఓపెనింగ్స్ 
  • కంటెంట్ లోపమే కారణమంటున్న ఆడియన్స్

మోహన్ లాల్ ఈ తరం హీరోలతో పోటీపడుతూ, వరుస సినిమాలతో ముందుకు దూసుకు వెళుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేయడం ఆయన సినిమాలకు అలవాటైపోయింది. అలాంటి మోహన్ లాల్ నుంచి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'వృషభ' వచ్చింది. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన మలయాళ .. తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు చేశారు. పోస్టర్స్  దగ్గర నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుంచే కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అంచనాలన్నీ ఒక్కసారిగా తలక్రిందులైపోయాయి. మలయాళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా తొలి రోజున 70 లక్షలను మాత్రమే రాబట్టగలిగింది. 

మోహన్ లాల్ సినిమా తొలిరోజున ఇంత తక్కువ వసూళ్లను రాబట్టడం చర్చనీయాంశమైంది. ఇంతవరకూ ఈ సినిమా 10 కోట్లకి పైగా మాత్రమే వసూలు చేయగలిగిందని ఆంటున్నారు. ప్రస్తుత కాలానికీ .. రాజుల కాలానికి ముడిపెడుతూ రూపొందించిన కథ ఇది. ఈ సినిమాలో మోహన్ లాల్ ద్విపాత్రాభినయం చేశారు. బలహీనమైన కంటెంట్ అందుకు కారణమనేది ఆడియన్స్ చెబుతున్న మాట. ఈ సినిమా ఈ స్థాయిలో నిరాశాజనకమైన వసూళ్లను రాబట్టడం, మోహన్ లాల్ ను ఆలోచనలో పడేసిందని టాక్. 

Mohanlal
Vrushabha Movie
Vrushabha Collections
Nanda Kishore
Malayalam Movies
Telugu Movies
Box Office Collections
Indian Cinema
Movie Review
Latest Movie News

More Telugu News