Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Visits Tirumala Srivari Temple
  • వైష్ణవ ఆలయాల్లో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు
  • తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తెలంగాణ సీఎం  
  • శ్రీవారి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అందించిన అర్చకులు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి శోభతో వెలిగిపోతున్నాయి. భక్తులు వేకువజామున 2 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు తరలివచ్చారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదట వీఐపీలకు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి దర్శనం కల్పించగా, సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామునే శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రే తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబానికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి సీఎం కుటుంబానికి తీర్థప్రసాదాలు అందజేశారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులు, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. 
Revanth Reddy
Telangana CM
Tirumala
Vaikunta Ekadasi
Srivari Temple
TTD
BR Naidu
Andhra Pradesh Temples

More Telugu News