Pinaka: లాంగ్ రేంజ్ గైడెడ్ మిస్సైల్ 'పినాక' ప్రయోగం విజయవంతం

Pinaka Long Range Guided Missile Successfully Tested
  • ఒడిశాలోని చండీపూర్‌ నుంచి పినాక ప్రయోగం చేపట్టిన డీఆర్‌డీవో  
  • 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడి
  • డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్
దేశీయ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పినాక (ఎల్ఆర్‌జీఆర్ 120) ప్రయోగం సక్సెస్ అయింది. ఈ రాకెట్ ప్రయోగాన్ని డీఆర్‌డీవో ఒడిశాలోని చండీపూర్‌ నుంచి చేపట్టింది. ఈ రాకెట్‌ గరిష్ఠంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు.
 
ఈ పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు. 
Pinaka
Pinaka missile
LRGR 120
DRDO
Chandiipur
Odisha
Rajnath Singh
defence
long range guided rocket

More Telugu News