Revanth Reddy: తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి... స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

Revanth Reddy Reaches Tirumala Welcomed by TTD Chairman BR Naidu
  • రేపు వైకుంఠ ఏకాదశి
  • తిరుమల విచ్చేసిన తెలంగాణ సీఎం
  • కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను చైర్మన్ శాలువాతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.

రేపు (మంగళవారం) ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 

కాగా, సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం హైదరాబాద్ తిరిగి వస్తారు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. 
Revanth Reddy
Telangana CM
Tirumala
TTD
BR Naidu
Vaikunta Ekadasi
Andhra Pradesh
Panabaka Lakshmi
Achannaidu
Payyavula Keshav

More Telugu News