Tom Moody: ఎక్కువమంది ప్రతిభావంతులు ఉండటమే టీమిండియాకు సమస్య: టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్య

Tom Moody Too Much Talent is Indias Problem
  • భారత్‌లో ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారన్న టామ్ మూడీ
  • ఎవరిని సెలక్ట్ చేయాలో తెలియక సెలక్టర్లు, కెప్టెన్లు ఇబ్బంది పడుతున్నారన్న టామ్
  • జట్టు ఎంపిక విషయంలో ఒక్కోసారి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్న టామ్
భారత క్రికెట్ గురించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో ఎక్కువమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండటం ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. ఇంతమంది నైపుణ్యం కలిగిన వారిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక సెలక్టర్లు, కెప్టెన్లు ఇబ్బందిపడుతున్నారని ఆయన తెలిపాడు. ఈ మేరకు మూడీ జియో హాట్‌స్టార్‌తో మాట్లాడాడు.

"భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటంటే, ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉండటం. ఎంతోమంది ఆటగాళ్లలో ఎవరిని ఎంపిక చేయాలా అని కెప్టెన్లు, సెలక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. జట్టు ఎంపిక విషయంలో ఒక్కోసారి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు" అని ఆయన వ్యాఖ్యానించాడు.
Tom Moody
Tom Moody India
India Cricket
Indian Cricket Team
Cricket Team Selection
Team India

More Telugu News