Shashi Tharoor: అద్వానీ పాదాల వద్ద మోదీ.. దిగ్విజయ్ సింగ్ ఫొటోపై స్పందించిన శశిథరూర్

Shashi Tharoor Responds to Digvijay Singhs Photo of Modi at Advanis Feet
  • కిందిస్థాయి వ్యక్తి ఉన్నతస్థానానికి ఎదిగారని అభిప్రాయపడుతూ దిగ్విజయ్ పోస్టు
  • మేమిద్దరం స్నేహితులం.. తమ మధ్య చర్చ జరిగిందన్న శశిథరూర్
  • 140 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ, నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్య
ఆరెస్సెస్‌లో కిందిస్థాయి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని పేర్కొంటూ, అద్వానీ పాదాల వద్ద నరేంద్ర మోదీ నేలపై కూర్చున్నప్పటి ఫొటోను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పరోక్షంగా ఆయన బీజేపీ, ఆరెస్సెస్‌ను ప్రశంసించినట్లుగా చాలామంది భావించారు. దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు, ఫొటోపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేత శశిథరూర్ స్పందించారు.

దిగ్విజయ్ సింగ్ చేసిన పోస్టును ఆయన సమర్థించారు. ఈ విషయంపై దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తామిద్దరం స్నేహితులమని, చర్చ జరగడం సహజమేనని అన్నారు. పార్టీని బలోపేతం చేయాలనే ఆయన అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు.

బలమైన సంస్థ నిర్మాణం కావాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఈ సందర్భంగా శశిథరూర్ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర ఉందని, అయినప్పటికీ ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.
Shashi Tharoor
Digvijay Singh
Narendra Modi
LK Advani
Congress Party
RSS
BJP
Indian Politics

More Telugu News