Indigo Airlines: హైదరాబాద్ సహా పలు నగరాల్లో... నేడు 118 ఇండిగో విమానాలు రద్దు

Indigo Airlines cancels 118 flights due to bad weather
  • విమానాల రద్దు అంశాన్ని వెబ్‌సైట్ ద్వారా తెలిపిన ఇండిగో
  • ఆపరేషనల్ కారణాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమానాలు రద్దు
  • హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో విమానాలు రద్దు
ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరియు ఇతర సమస్యల కారణంగా ఈ రోజు 118 విమానాలను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వీటిలో ఆరు విమాన సర్వీసులు నిర్వహణ కారణాలతో నిలిచిపోగా, మిగిలినవి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రద్దు చేసినట్లు పేర్కొంది.

హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చిన్, కోల్‌కతా, అమృత్‌సర్, చండీగఢ్, జైపూర్, డెహ్రాడూన్, ఇండోర్, పాట్నా, భోపాల్‌ నగరాల్లో విమాన సర్వీసులు రద్దు చేయబడినట్లు ఇండిగో వెబ్‌సైట్ ద్వారా తెలిపింది. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని అనేక విమానాశ్రయాలలో పొగమంచు వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది.
Indigo Airlines
Indigo flights cancelled
flight cancellations India
Hyderabad flights
Delhi fog
India weather

More Telugu News