రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో 'అప్పలసూరి'గా జగపతిబాబు... లుక్ ఇదిగో!

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కీలక అప్డేట్'
  • అప్పలసూరి'గా జగపతిబాబు పాత్ర పరిచయం
  • శక్తివంతమైన పాత్రలో నటిస్తున్న జగ్గూభాయ్
  • 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు పోషిస్తున్న పాత్రను, ఆయన ఫస్ట్ లుక్‌ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది.

ఈ సినిమాలో జగపతిబాబు 'అప్పలసూరి' అనే శక్తివంతమైన, ప్రభావవంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటన మరోసారి మాస్టర్‌క్లాస్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. విడుదల చేసిన పోస్టర్‌లో జగపతిబాబు తనదైన విలక్షణమైన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. అసలు, ఆ పోస్టర్ లో ఉన్నది జగపతిబాబే అనేలా ఆయన మేకప్ ఉంది. ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం కానుందని తెలుస్తోంది. 

ఈ పాన్-ఇండియా చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.


More Telugu News