Ram Gopal Varma: శివాజీకి 'రాజా సాబ్' హీరోయిన్లతో ఆర్జీవీ కౌంటర్

Ram Gopal Varma Counter to Sivaji on Raja Saab Heroines
  • నటుడు శివాజీపై మరోసారి విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ
  • ప్రభాస్ 'రాజా సాబ్' హీరోయిన్లను ఉదాహరణగా చూపిన వైనం
  • శివాజీ వ్యాఖ్యలను పట్టించుకోలేదంటూ హీరోయిన్లను ప్రశంసించిన ఆర్జీవీ
  • మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి ఘాటుగా స్పందించారు. శివాజీ మోర‌ల్ పోలీసింగ్‌ను విమర్శిస్తూ, ప్రభాస్ కొత్త సినిమా 'ది రాజా సాబ్' హీరోయిన్లను ఉదాహరణగా చూపించారు. ఆ ముగ్గురు హీరోయిన్లను హీరోలుగా అభివర్ణించారు.

ఇటీవల జరిగిన 'రాజా సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోను ఆర్జీవీ తన 'ఎక్స్‌' ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ప్రభాస్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ఉన్నారు. ఈ ఈవెంట్‌లో వారి వస్త్రధారణను ప్రస్తావిస్తూ వర్మ తనదైన శైలిలో స్పందించారు. "శివాజీ, అతని బ్యాచ్ చేస్తున్న నైతిక విమర్శలను ప్రభాస్ హీరోయిన్లు ముగ్గురూ పట్టించుకోలేదు. వాళ్లకు నచ్చిన డ్రెస్సులే వేసుకున్నారు. ఆ విలన్లకు గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిన 'ముగ్గురు హీరోల'కు (హీరోయిన్లకు) హ్యాట్సాఫ్" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

ఇంతకుముందు కూడా ఇదే విష‌యమై శివాజీపై ఆర్జీవీ తీవ్రంగా మండిపడ్డారు. "మీ నీతులు మీ ఇంట్లో మహిళలకు చెప్పుకోండి... సమాజంలోని ఇతర మహిళలకు కాదు" అంటూ ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే. 
Ram Gopal Varma
RGV
Sivaji
Prabhas
The Raja Saab
Nidhhi Agerwal
Malavika Mohanan
Ridhi Kumar
Moral Policing
Telugu Cinema

More Telugu News