దేనికైనా టైమ్ రావాలంతే: 'జబర్దస్త్' ఫణి!
- 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన ఫణి
- ఒకప్పుడు బిజీగా ఉన్న నటుడు
- ఎవరినీ డిమాండ్ చేయలేదని వ్యాఖ్య
- అవకాశాలు తగ్గాయంటున్న కమెడియన్
- మంచి రోజులు వస్తాయంటూ ఆశాభావం
'జబర్దస్త్' కారణంగా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో ఫణి ఒకరు. తాగుబోతు పాత్రలు చేయడంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఒకప్పుడు ఒక వైపున జబర్దస్త్ షోలో కనిపిస్తూనే, మరో వైపున సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ బిజీగా ఉన్నాడు. అలాంటి ఫణి ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయ్యాడు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కూడా అదే విషయాన్ని గురించి ప్రస్తావించాడు.
" ఈ మధ్య కాలంలో నేను బాగా స్లో అయ్యాను అనే చెప్పాలి. అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఒకానొక సమయంలో నా భార్య అనారోగ్య కారణాల వలన, నేనే దగ్గరుండి తనని చూసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో నేను అంతగా సినిమాలు చేయలేకపోయాను. ఇప్పుడు చేద్దామని ఉన్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. ఎవరైనా కాల్ చేస్తే ఛాన్స్ వచ్చినట్టేనని సంబరపడిపోవలసి వస్తోంది" అని అన్నాడు.
"మొదటి నుంచి కూడా నేను ఎవరినీ నాకు ఇంత కావాలని డిమాండ్ చేయలేదు. నాకు వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లాను. ఇండస్ట్రీలో నాకు అంతా తెలిసినవారే .. అందరికీ టచ్ లోనే ఉంటున్నాను. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. కెరియర్ చాలా స్లో అయింది. కేవలం సినిమాలను మాత్రమే నమ్ముకుని రావడం కరెక్టు కాదేమో అని కూడా అనిపిస్తోంది. దేనికైనా టైమ్ రావాలి .. అలాంటి టైమ్ నాకు మళ్లీ వస్తుందనే నమ్మకం ఉంది" అని చెప్పాడు.