Inaya Sultana: ఒక్క ఛాన్స్ రాలేదు .. భయం వేసింది: ఇనయా సుల్తానా

Inaya Sulthana Interview
  • యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఇనయా 
  • 'బిగ్ బాస్ 6' తరువాత ఛాన్సులు రాలేదని వెల్లడి
  • అవకాశాల కోసం తిరిగవలసి వచ్చిందని వ్యాఖ్య 
  • ప్రేమలో మోసపోయానని వివరణ

 ఇనయా సుల్తానా ..  ఇంతవరకూ చేస్తూ వెళ్లింది చిన్న చిన్న పాత్రలే అయినా, యూత్ లో తనకి క్రేజ్ ఉంది. 'బిగ్ బాస్ 6' లోను కనిపించి సందడి చేసిన ఇనయా, తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను ఊరు నుంచి వచ్చాను .. ఎలా ఉండాలి .. ఎలా మాట్లాడాలి .. ఎలా కనిపించాలి అనే విషయాలు కూడా అప్పటికి నాకు తెలియదు. కానీ ఆ తరువాత నేర్చుకుంటూ వచ్చాను" అని అన్నారు.

'బిగ్ బాస్ సీజన్ 6'లో నేను ఉన్నాను. 14 వారాల పాటు సందడి చేశాను. ఆ తరువాత కూడా నాకు సినిమాలలో ఛాన్సులు రాలేదు. దాదాపు ఏడాది పాటు ఏ సినిమా చేయలేదు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతానేమోనని భయం వేసింది. దాంతో మళ్లీ సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. అప్పుడే మళ్లీ అవకాశాలు రావడం మొదలైంది. అయితే అలా నేను చేసిన సినిమాలలో చాలా సీన్స్ ఎడిటింగ్ లో పోవడం బాధను కలిగించింది" అని చెప్పారు.

"నాకెవరూ లేరు అనే ఒక ఒంటరి తనం నన్ను వేధించేది. నా మనిషి .. అనేవారు ఒకరు తోడుగా ఉంటే బాగుండేది అనిపించింది. ఆ సమయంలో నేను ఒకరి ప్రేమలో పడిపోయాను. అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అన్ని రకాలుగా నేను అతనిని నమ్ముతూ వెళ్లాను. అయితే ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు. నాదే పొరపాటు .. నాదే తప్పు అనే విషయం అర్థం కావడానికి నాకు కొంత సమయం పట్టింది" అని అన్నారు. 

Inaya Sultana
Inaya Sultana Bigg Boss
Bigg Boss 6 Telugu
Telugu Actress
Movie opportunities
Film career
Depression
Love failure
Suman TV interview
Telugu cinema

More Telugu News