Vishal NRI: భారత్ కంటే కెనడాలోనే లైఫ్ 10 రెట్లు బెటర్.. ఎన్‌ఆర్‌ఐ యువకుడి వ్యాఖ్యలు

NRI Vishal Says Canada Life 10 Times Better Than India
  • కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద వాతావరణం లభిస్తాయన్న యువకుడు
  • భారత మెట్రో నగరాల్లో నిరంతర హారన్ల మోత వల్ల ప్రశాంతత కరవైందని ఆవేదన
  • విశాల్‌ వ్యాఖ్యలపై రెండుగా విడిపోయిన నెటిజన్లు 
భారత్ వదిలి కెనడా వెళ్లిన విశాల్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. "కెనడాలో మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలు భారత్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి" అని అతను పేర్కొన్నాడు. భారత్‌లోని రద్దీ నగరాల్లో కనిపించే ట్రాఫిక్ గందరగోళం, హారన్ల శబ్దాలు కెనడాలో ఉండవని, ఇక్కడ ఉదయాన్నే పక్షుల కిలకిలా రావాలు వింటూ స్వచ్ఛమైన గాలి పీల్చవచ్చని వీడియోలో చూపించాడు.

ఈ వీడియోపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. "నిజమే, అక్కడ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి.. ఇది చేదు నిజం" అని కొందరు మద్దతు పలుకుతున్నారు. అయితే, భారత్ తరపున వాదించేవారు మాత్రం.. "కెనడాలో రోడ్లు బాగుండవచ్చు కానీ, భారత్‌లో ఉండే ఆత్మీయత, కుటుంబ సభ్యుల తోడు అక్కడ దొరకవు" అని గట్టిగా సమాధానం ఇస్తున్నారు. మరికొందరు కెనడాలో విపరీతంగా పెరిగిన జీవన వ్యయం, మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవడం అంత సులభం కాదని చురకలు అంటిస్తున్నారు.
Vishal NRI
Canada life
India vs Canada
NRI life
Immigration to Canada
Cost of living Canada
Indian diaspora
Canada lifestyle
Quality of life
Canada weather

More Telugu News