ఎక్కువ గంటలు పనిచేయడం కాదు... పనిలో నాణ్యత ముఖ్యం: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు శిబులాల్
- ఏ పని చేస్తున్నా పూర్తి ఏకాగ్రతతో ఉండటానికే ప్రాధాన్యం ఇస్తానన్న శిబులాల్
- సమయపాలన విషయంలో ప్రతి వ్యక్తికి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యాలు వేర్వేరుగా ఉంటాయని వ్యాఖ్య
- పనికి కేటాయించిన సమయంలో మాత్రం 100 శాతం అదే పనిలో నిమగ్నమవ్వాలంటూ సూచన
పనిలో గడిపే గంటల సంఖ్య కంటే, ఆ సమయంలో చేసే పనిపై ఎంత శ్రద్ధ పెట్టామన్నదే ముఖ్యమని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్‌డీ శిబులాల్ అభిప్రాయపడ్డారు. వారానికి ఎన్ని గంటలు పని చేయాలన్న చర్చల మధ్య, ‘ఎక్కువ సమయం పని చేయడం కంటే, ఆ పనిలో నాణ్యతే అత్యంత ముఖ్యం’ అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శిబులాల్ మాట్లాడుతూ, తాను ఏ పని చేస్తున్నా పూర్తి ఏకాగ్రతతో ఉండటానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ‘‘ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే.. పూర్తిగా ఇక్కడే ఉండాలి. సెల్‌ఫోన్‌తోనో, ఇతర ఆలోచనలతోనో పరధ్యానంలో ఉండలేను. కేటాయించిన సమయంలో ఆ పనికే పూర్తిగా అంకితమవ్వాలి’’ అన్నారు.
సమయపాలన విషయంలో ప్రతి వ్యక్తికి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యాలు వేర్వేరుగా ఉంటాయని శిబులాల్ తెలిపారు. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం, ప్రజా జీవితం మధ్య సమయాన్ని ఎలా పంచుకోవాలన్నది వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే, ఏ పనికి ఎంత సమయం కేటాయించామో.. ఆ సమయంలో మాత్రం 100 శాతం అదే పనిలో నిమగ్నమవ్వాలని సూచించారు.
ఇన్ఫోసిస్‌లో 2014 వరకు మూడేళ్ల పాటు సీఈఓగా పనిచేసిన శిబులాల్ వ్యాఖ్యలు, ఇటీవల పని గంటలపై జరుగుతున్న చర్చలకు భిన్నంగా ఉన్నాయి. గతంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటలు పని చేయాలని సూచించిన సందర్భాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిబులాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.