Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ పై సిద్ధూ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
- దేవుడు వరమిస్తే కోహ్లీ రిటైర్మెంట్ వాపస్ తీస్కోవాలనే కోరుకుంటా..
- టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ ఆడాలని ఆకాంక్షించిన మాజీ క్రికెటర్
- ఇన్ స్టాలో వైరల్ గా మారిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ పోస్ట్
కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ లలో కోహ్లీ లేని లోటు తీవ్రంగా కనిపిస్తోందని, ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కనిపించడంలేదని కోహ్లీ అభిమానులు వాపోతున్నారు. కోహ్లీ తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుని మళ్లీ టెస్టుల్లో ఆడాలని కోరుకుంటున్నారు. కోహ్లీ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం టెస్టుల్లోకి కోహ్లీ పునరాగమనం చేయాలని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ అయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు.
కోహ్లీ మళ్లీ టెస్ట్ మ్యాచ్ లలో ఆడాలని, దేవుడు వరమిస్తే తాను ఇదే కోరుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు సిద్ధూ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘దేవుడు నాకు వరం ప్రసాదించి ఏదైనా కోరుకోమంటే కోహ్లీ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేలా చేయమనే అడుగుతా. విరాట్ కోహ్లీ 24 క్యారెట్ల బంగారం. వయసు పెరిగినా కూడా అతడు 20 ఏళ్ల యువకుడిలా ఫిట్ గా ఉన్నాడు’ అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ పోస్టుకు లైక్ లు కొడుతూ కోహ్లీ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడాలని కామెంట్లు పెడుతున్నారు.