Yunnan Province: పెళ్లికి ముందే గర్భం దాలిస్తే భారీ జరిమానా.. ఎక్కడంటే..!

China Village Fines Unmarried Couples and Pregnancy Before Marriage
  • పెళ్లయ్యాక 10 నెలల లోపు ప్రసవించినా ఫైన్ తప్పదు
  • సహజీవనం చేస్తే ఏటా రూ.6 వేలు చెల్లించాలట
  • పొరుగు రాష్ట్రం వారిని పెళ్లి చేసుకుంటే రూ.19 వేలు ఫైన్
  • చైనాలోని ఓ గ్రామంలో నిబంధనలతో బోర్డు ఏర్పాటు
నగరాలలో నాగరికత పేరుతో సహజీవనం, వివాహానికి ముందే గర్భం దాల్చడం, ప్రేమ పెళ్లిళ్లు సాధారణంగా మారిపోయాయి. ఇలాంటి వ్యవహారాలను తమ గ్రామంలోకి అడుగుపెట్టకుండా చేసేందుకు చైనాలోని యునాన్ రాష్ట్రం లిన్‌‌కాంగ్ జిల్లాలో ఓ గ్రామస్థులు కఠినమైన నిబంధనలను పెట్టుకున్నారు. ఈమేరకు గ్రామ పెద్దలు ఓ తీర్మానం చేసి కొన్ని రూల్స్ నిర్ణయించారు. గ్రామంలో ఎవరైనా వివాహం కాకుండా కలిసి ఉంటే ఏటా 500 యువాన్లు (సుమారు రూ.6 వేలు) జరిమానాగా చెల్లించాలని నిర్ణయించారు. అదేవిధంగా, పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి 3,000 యువాన్లు (రూ.38,472), పెళ్లి అయిన తర్వాత 10 నెలల లోపే బిడ్డకు జన్మనిచ్చినా ఇంతే మొత్తం ఫైన్ కట్టాలని పేర్కొన్నారు.

ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు (సుమారు రూ.19 వేలు), దంపతులు గొడవపడి గ్రామ పెద్దల వద్దకు వస్తే ఇద్దరూ చెరో 500 యువాన్లు (సుమారు రూ.6 వేలు), మద్యం సేవించి గ్రామంలో గొడవ చేస్తే 3 వేల నుంచి 5 వేల యువాన్లు (రూ.38,472 నుంచి రూ.64,120), నిరాధార ఆరోపణలు, పుకార్లు సృష్టిస్తే 500 నుంచి 1,000 యువాన్లు (రూ.6,412 నుంచి రూ.12,824) జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓ బోర్డును తయారు చేసి గ్రామంలోని కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నియమాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే ఆ బోర్డును తొలగించారు.
Yunnan Province
China
Pregnancy before marriage
Lincong district
Village rules
Traditional values
Morality
Fines
Social media
Viral photo

More Telugu News