Ragunandan Rao: ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో పంచాయితీ చూసుకోవాలి: రఘునందన్ రావు
- అక్కడ రేపు ఎన్నికలు వస్తే ఏమవుతుందో చూసుకోవాలన్న మెదక్ ఎంపీ
- 150 పథకాల్లో రెండు మూడింటికి మాత్రమే గాంధీ పేరు పెట్టారన్న రఘునందన్
- గాంధీ పేరు లేకుంటే నకిలీ గాంధీలకు మనుగడ ఉండదన్న ఎంపీ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుగా సొంత రాష్ట్రం కర్ణాటకలో పంచాయితీని చక్కదిద్దుకోవాలని, అక్కడ రేపు ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమవుతుందో చూసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
150 పథకాల్లో కాంగ్రెస్ హయాంలో మహాత్మా గాంధీ పేరు పెట్టింది రెండు, మూడు పథకాలకు మాత్రమేనని రఘునందన్ రావు అన్నారు. దేశంలో నకిలీ గాంధీల మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడంపై ఆయన స్పందించారు. గాంధీ పేరు లేకుంటే నకిలీ గాంధీలకు మనుగడ ఉండదని భయపడుతున్నారని విమర్శించారు.
మహాత్మా గాంధీపై సోనియా గాంధీ కుటుంబానికి చిత్తశుద్ధి ఉంటే వారి హయంలో గాంధీ పేరుతో ప్రవేశపెట్టిన పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసపై కాంగ్రెస్ కనీసం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాహుల్ గాంధీ తన తండ్రి ప్రవేశపెట్టిన ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్లు, బీజేపీ గెలిస్తే ఈవీఎంలు పనిచేయనట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
రాహుల్ గాంధీకి తన తండ్రి అంటే ఏమాత్రం గౌరవం, విశ్వాసం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నో ముక్కలైందని, ఇప్పుడు దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా అందడం లేదని మండిపడ్డారు.
కేటీఆర్, హరీశ్ రావులతో ఏమీ కావడం లేదని కేసీఆర్ బయటకు వచ్చారని, కానీ ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఏమాత్రం ఉండదని రఘునందన్ రావు అన్నారు. ఇంట్లో పంచాయితీతో బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడిందని, అందుకే కేసీఆర్‌ను బయటకు తీసుకువచ్చారని అన్నారు.