Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్‌... 23 మంది నిందితులు వీరే

Sandhya Theatre Stampede Case Allu Arjun Named in Charge Sheet
  • సమగ్ర విచారణ జరిపినట్లు తెలిపిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం
  • భద్రతా లోపాలను గుర్తించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న పోలీసులు
  • దర్యాప్తులో సమన్వయ లోపం ఉన్నట్లు వెల్లడైందని పేర్కొన్న పోలీసులు
గత సంవత్సరం సంధ్య థియేటర్‌లో పుష్ప-2 చిత్రం విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపిన పోలీసులు, సినీ నటుడు అల్లు అర్జున్ పేరును ఏ-11గా చేర్చారు. వీరిలో 14 మంది నిందితులను అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్ పొందిన తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సమగ్రమైన, వివరణాత్మక దర్యాప్తు జరిపామని, మూడు రోజుల క్రితం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఘటనకు గల కారణాలను కూడా ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. భద్రతా లోపాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు, ప్రైవేటు భద్రతా సిబ్బంది మధ్య సమన్వయ లోపం ఈ దుర్ఘటనకు కారణమని దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.

సంధ్య థియేటర్ నిందితుల జాబితా:

A1: ఆగమతి రామ్ రెడ్డి (పెద్ద రామ్ రెడ్డి) - భాగస్వామి (సంధ్య థియేటర్ యజమాని)
A2: ఆగమతి రామ్ రెడ్డి (చిన్న రామ్ రెడ్డి) - సంధ్య థియేటర్ భాగస్వామి
A3: ఎం.సందీప్ - సంధ్య థియేటర్ భాగస్వామి
A4: ఎం. సుమిత్ (మిట్టు)- సంధ్య థియేటర్ భాగస్వామి
A5: ఆగమతి వినయ్ కుమార్ - సంధ్య థియేటర్ భాగస్వామి
A6: ఆగమతి అశుతోష్ రెడ్డి - సంధ్య థియేటర్ భాగస్వామి
A7: ఎం.రేణుకా దేవి - సంధ్య థియేటర్ భాగస్వామి
A8: ఆగమతి అరుణ రెడ్డి - సంధ్య థియేటర్ భాగస్వామి
A9: ఎం. నాగరాజు - మేనేజర్, సంధ్య థియేటర్
A10: గంధకం విజయ్ చందర్ - లోయర్ బాల్కనీ ఇన్‌ఛార్జ్ మరియు గేట్ కీపర్
A11: అల్లు అర్జున్ (బన్నీ) - సినీ నటుడు
A12: జోస్య భట్ల సంతోష్ కుమార్ - అల్లు అర్జున్ మేనేజర్
A13: శరత్ బన్నీ (శరత్ చంద్ర నాయుడు) - అల్లు అర్జున్ మేనేజర్
A14: తాటిపాముల వినయ్ కుమార్ (అర్జున్ కుమార్) - ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్‌ఛార్జ్
A15: ఎండీ. పర్వేజ్ - A16 నిందితుడి అసిస్టెంట్
A16: తాళ్ల కిరణ్ కుమార్ గౌడ్ (రాజు) - ఈవెంట్ ఆర్గనైజర్ / ఎలక్ట్రీషియన్
A17: చెరుకు రమేష్ - అల్లు అర్జున్‌ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్
A18: శ్రీరాముల రాజు - అల్లు అర్జున్‌కి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్
A19: ఇబ్రహీం మొహమ్మద్ ఫిర్దోష్ - బౌన్సర్
A20: ఆజం పాషా (బాబీ) - బౌన్సర్
A21: డి. మహేష్ - బౌన్సర్
A22: రాజ్ ఆంటోనీ డిమెల్లో (ఆంటోనీ) - బౌన్సర్
A23: పెగ్గాపురం సత్యమూర్తి - బౌన్సర్
Allu Arjun
Sandhya Theatre
Pushpa 2
Stampede
Hyderabad
Police
Charge sheet
Negligence

More Telugu News