Shivaji: ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది: శివాజీ

Shivaji Claims Conspiracy Against Him in Industry
  • మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన వైనం
  • మహిళా కమిషన్ విచారణకు హాజరైన శివాజీ
  • తన మాటలను వక్రీకరించారన్న నటుడు
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకుని విచారణ చేపట్టింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన విచారణకు హాజరయ్యారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోనే తనపై కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. తన మాటలను వక్రీకరించి కొందరు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. ఇండస్ట్రీలో కొంతమందికి ఇప్పటికే తనపై వ్యతిరేకత ఉందని శివాజీ చెప్పారు. జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో ఆవేశంలో రెండు తప్పు పదాలు ఉపయోగించానని, వాటికిగాను ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పానన్నారు. మహిళా కమిషన్ ప్రభుత్వ సంస్థ కావడంతో గౌరవంతో వచ్చి వివరణ ఇచ్చానని తెలిపారు. తాను తండ్రి పాత్రలో ఉన్న వ్యక్తిగా పిల్లలకు హితబోధ చేసిన ఉద్దేశంతోనే మాట్లాడానని, అందులో చెడు ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని కమిషన్‌ను కోరారు.
Shivaji
Shivaji actor
Telugu actor Shivaji
Dandora movie
Women's Commission
Controversy
Zoom meeting
Conspiracy
Apology

More Telugu News