Chandrababu Naidu: జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu Reviews Districts Divisions Mandals Reorganization
  • అభ్యంతరాల స్వీకరణ గడువు నేటితో ముగింపు
  • రాష్ట్రవ్యాప్తంగా 927 అభ్యంతరాలు నమోదు
  • డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు
  • రాష్ట్రంలో 29కి పెరగనున్న మొత్తం జిల్లాల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజనపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

గత నెల 27న ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఈ గడువు నేటితో ముగియడంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

సమావేశంలో కొన్ని కీలక ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లె జిల్లాలో, గూడూరును నెల్లూరు జిల్లాలో, పొదిలిని ప్రకాశం జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపడం వంటి అంశాలపై కూడా చర్చించారు. అందిన అన్ని అభ్యంతరాలను సమీక్షించిన అనంతరం డిసెంబర్ 31న పునర్విభజనపై తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఇటీవల ప్రకటించిన 3 కొత్త జిల్లాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 29కి చేరనుంది.
Chandrababu Naidu
Andhra Pradesh
Districts Reorganization
New Districts
Administrative Divisions
Mandals
Gudur Nellore
Rajampet Kadapa

More Telugu News