Indian Railways: ఏపీలో ప్రధాన నగరాల రైల్వే స్టేషన్లకు మహర్దశ... ఐదేళ్లలో సామర్థ్యం రెట్టింపు

Indian Railways to Double Capacity in Key Cities Like Hyderabad Visakhapatnam
  • ప్రయాణికుల అవసరాల మేరకు రైళ్ల సామర్థ్యం పెంచేందుకు రైల్వే శాఖ చర్యలు 
  • రైల్వే ప్లానింగ్ డైరెక్టరేట్ కు సమగ్ర ప్రణాళిక 
  • రైల్వే శాఖ ప్రణాళికలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్లు
దేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, దేశంలోని 48 ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్ల సామర్థ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

2030 నాటికి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే క్రమంలో భాగంగా అదనపు ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణం, కొత్త టర్మినల్స్ ఏర్పాటు, నిర్వహణ సౌకర్యాల మెరుగుదల, సెక్షన్ కెపాసిటీ పెంపు వంటి చర్యలు చేపట్టనున్నారు. రైల్వే ప్లానింగ్ డైరెక్టరేట్‌కు సమగ్ర ప్రణాళికను సమర్పించి, ఆమోదం పొందిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రైల్వే శాఖ ప్రణాళికలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పాట్నా, పుణె వంటి ఇతర నగరాల స్టేషన్లు కూడా ఉన్నాయి. ఆమోదం పొందిన ప్రతిపాదనలు, ప్రణాళికలను సైతం ఈ యాక్షన్ ప్లాన్‌లో చేర్చి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 
Indian Railways
railway infrastructure
railway capacity
Hyderabad railway station
Visakhapatnam railway station
Vijayawada railway station
Tirupati railway station
railway development
Indian railway expansion

More Telugu News