Chandrababu Naidu: తిరుపతిలో ఎన్టీఆర్ రాజు నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Visits NTR Raju Residence in Tirupati
  • తిరుపతిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • టీడీపీ నేత ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
  • సంస్కృత విశ్వవిద్యాలయం కార్యక్రమంలో కీలక ప్రసంగం
  • పాశ్చాత్య హీరోల కన్నా భారతీయ పురాణాలే మిన్న అని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించారు.

ఎన్టీఆర్ రాజు కుమారుడు, టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ రాజు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్ వర్మ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్, పులివర్తి నాని, స్థానిక నేతలు ఉన్నారు.
Chandrababu Naidu
NTR Raju
TDP
Andhra Pradesh
Tirupati
Sridhar Varma
Anagani Satyaprasad
Telugu Desam Party

More Telugu News