Randhir Jaiswal: హెచ్-1బీ వీసా అంశంపై స్పందించిన భారత్

India Responds on H1B Visa Issue
  • వీసా అపాయింట్‌మెంట్‌ల షెడ్యూలింగ్ లేదా రీషెడ్యూలింగ్‌లో ఇబ్బందులు
  • ఫిర్యాదులు అందినట్లు తెలిపిన రణధీర్ జైశ్వాల్
  • భారత సంతతి వ్యక్తి మృతిపై కెనడా ప్రభుత్వానిదే బాధ్యత అన్న భారత్
అమెరికా హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్‌ల షెడ్యూలింగ్ లేదా రీషెడ్యూలింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఈ విషయాన్ని తాము అమెరికా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు ఆయన వెల్లడించారు. ఇది అమెరికా సార్వభౌమాధికార పరిధిలోని అంశమే అయినప్పటికీ, తమ ఆందోళనలను అమెరికాకు తెలియజేశామని ఆయన పేర్కొన్నారు.

కెనడాలో గుండెపోటు కారణంగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఇటీవల మరణించిన ఘటనపై కూడా భారత్ స్పందించింది. మృతుడు భారత సంతతికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, అతనికి కెనడా పౌరసత్వం ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో కెనడా ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొంది. తీవ్ర ఛాతి నొప్పితో తన భర్తను ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ, చికిత్స కోసం దాదాపు ఎనిమిది గంటలు వేచిచూడాల్సి వచ్చిందని, దీని కారణంగానే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుడి భార్య ఆరోపించారు.
Randhir Jaiswal
H-1B visa
US visa appointments
Indian Foreign Ministry
Canada
Heart attack

More Telugu News