Sivaji: యాంకర్ మైక్ ఇవ్వబోతే, దండం పెట్టి వద్దన్న నటుడు శివాజీ

Sivaji Refuses Mic at Dandora Success Meet
  • పాజిటివ్ టాక్ రావడంతో దండోరా చిత్ర బృందం సక్సెస్ మీట్
  • ఈ కార్యక్రమంలో మాట్లాడిన నటుడు శివాజీ
  • తన వ్యక్తిగత విషయాలకు సినిమాతో లింక్ పెట్టవద్దని విజ్ఞప్తి
దండోరా చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా యాంకర్ స్రవంతి, నటుడు శివాజీకి మైక్ ఇవ్వబోగా, ఆయన వినయంగా దండం పెట్టి వద్దన్నట్లు సైగ చేశారు. ఆయన వేదికపైకి వచ్చి తన స్థానంలో కూర్చున్నాక కూడా యాంకర్ మైక్ ఇచ్చేందుకు ప్రయత్నించగా, శివాజీ సున్నితంగా తిరస్కరించడంతో ఆమె మరొకరికి ఇచ్చారు. దండోరా చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సినిమా గురించి కొంతమంది మాట్లాడిన అనంతరం శివాజీ ప్రసంగించారు. దండోరా సినిమాకు తన వ్యక్తిగత విషయాలను ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత విషయాలను వేరుగా చూసుకుంటానని, వాటి ప్రస్తావన లేకుండా సినిమాను ప్రోత్సహించాలని కోరారు. అలా కాని పక్షంలో ఆ నింద తాను మోయాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడాలని, థియేటర్‌కు వచ్చి ఏం మాట్లాడాలన్నా అభిమానులతో ముచ్చటిస్తానని తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలు కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తాయని అన్నారు. రెండు రోజుల ముందు ప్రీమియర్స్ వేసి ఉంటే కలెక్షన్లు వేరే విధంగా ఉండేవని, సెన్సార్ వల్ల విడుదల ఆలస్యమైందని చెప్పారు. దండోరా గురించి 2026 వరకు మాట్లాడుకుంటారని ఆయన అన్నారు. విదేశాల్లో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోయానని, తన పాత్ర కోసం ముఖం ఉబ్బినట్టు కనిపించేలా నిద్రను తగ్గించానని అన్నారు. సినిమా మొత్తం నిద్ర ముఖంతోనే కనిపిస్తానని చెప్పారు.

నిద్రను తగ్గించమని దర్శకుడు తనకు చెప్పలేదని, ఒకవేళ తన పాత్రకు తగినట్టుగా కనిపించకపోతే దర్శకుడు ఇబ్బంది పడతారని అన్నారు. తనతో పాటు ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. మంచి సినిమాను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి కళాకారుడిపై ఉందని శివాజీ అన్నారు.
Sivaji
Dandora movie
Telugu cinema
Sravanthi anchor
Dandora success meet
Telugu film industry

More Telugu News