Shreyas Iyer: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer at BCCI Center of Excellence
  • జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్
  • జనవరి 2 లేదా 3న జట్టును ప్రకటించే అవకాశం
  • శ్రేయాస్ అయ్యర్ దురదృష్టవశాత్తు గాయపడ్డాడన్న బీసీసీఐ అధికారి
  • ప్రస్తుతం అతడు నొప్పి లేకుండా ఉన్నాడని వెల్లడి
భారత బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం అతను ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. గురువారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు వెళ్లాడు. జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ సిరీస్ కోసం జనవరి 2 లేదా 3 తేదీల్లో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఓఈ క్లియరెన్స్ వస్తే ఆయన జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

శ్రేయాస్ అయ్యర్ దురదృష్టవశాత్తు గాయపడ్డాడని, దీని కారణంగా ఆయన చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

దీంతో అతను చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడని, ఒక మంచి విషయమేమంటే ప్రస్తుతం అతడు నొప్పి లేకుండా ఉన్నాడని చెప్పారు. రెగ్యులర్‌గా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడని, నాలుగైదు రోజుల పాటు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉంటాడని తెలిపారు. అక్కడ అయ్యర్ ఫిట్‌నెస్‌ను మెడికల్, స్పోర్ట్స్ సైన్స్ స్టాఫ్ అంచనా వేస్తోందని అన్నారు.
Shreyas Iyer
BCCI
BCCI Center of Excellence
India vs New Zealand
India Cricket
Cricket
Injury Update

More Telugu News