Hyderabad Police: 2026 నూతన సంవత్సర వేడుకలు.. హైదరాబాద్‌లో డిసెంబర్ 31 వరకు తనిఖీలు

Hyderabad Police to Conduct Drunk and Drive Checks Until December 31 for New Year 2026
  • హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు
  • ఈరోజు 304 మందిని పట్టుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
2026 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు నిర్వహించిన తనిఖీలలో 304 మంది పట్టుబడ్డారు.

ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈగల్ టీమ్ సిబ్బంది మేడిపల్లిలోని గంజాయి పెడ్లర్స్‌పై దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేసింది. మేడిపల్లి పోలీసులతో కలిసి ఈ దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని అక్రమ్, షఫీ, పృథ్వీరాజ్, రాహుల్‌గా గుర్తించారు. పృథ్వీరాజ్ కొవిడ్ తర్వాత ఉపాధి కోల్పోయి, ఆ తరువాత ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
Hyderabad Police
Hyderabad
Drunk and Drive
New Year 2026
Traffic Police
Ganja Peddlers

More Telugu News