Encounter In Odisha: ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

Odisha Naxal Encounter Five Maoists Killed in Kandhamal
  • ఒడిశా కందమాల్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
  • భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
  • మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు
  • ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం
ఒడిశాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కందమాల్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు తారసపడటంతో లొంగిపోవాలని బలగాలు హెచ్చరించాయి. అయితే, మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో భద్రతా దళాలు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే చ‌నిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బలగాలు ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Encounter In Odisha
Odisha Naxal Encounter
Odisha
Kandhamal
Maoists
Naxals
Security Forces
Anti-Naxal Operation
Chhattisgarh
Gumma Forest

More Telugu News