Chandrababu: సీఎం చంద్రబాబు నివాసానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

Chandrababu and Shivraj Singh Chouhan Inaugurate Vajpayee Statue in Amaravati
  • ముఖ్యమంత్రితో కలిసి అల్పాహార విందులో పాల్గొన్న చౌహాన్
  • అమరావతిలో వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేతలు
  • నేటితో ముగియనున్న బీజేపీ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర
  • వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా 12 అడుగుల విగ్రహం ఏర్పాటు
సీఎం చంద్రబాబు నివాసానికి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉదయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. కాసేపట్లో ఇద్దరూ కలిసి రాజధాని అమరావతికి బయలుదేరనున్నారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకుని అమరావతిలోని వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించనున్నారు. వాజ్‌పేయి పేరుతో ఏర్పాటు చేస్తున్న ‘స్మృతి వనం’ను కూడా వారు ప్రారంభించనున్నారు. ఈ స్మృతి వనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో జరిగిన ‘అటల్ మోదీ సుపరిపాలన యాత్ర’ ముగింపు సభగా జరగనుంది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన ఈ యాత్ర రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కొనసాగింది. నేడు అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పీవీఎన్ మాధవ్ ప్రసంగించనున్నారు.
Chandrababu
Shivraj Singh Chouhan
Andhra Pradesh
Amaravati
Atal Bihari Vajpayee
PVN Madhav
BJP
Seed Axis Road
Smriti Vanam
Atal Modi Suparipalana Yatra

More Telugu News