V Ramakrishna: ఆప్కాబ్ ఎండీగా వి.రామకృష్ణ నియామకం

V Ramakrishna Appointed as APCOB MD
  • కొత్త ఎండిగా వి.రామకృష్ణను ఎంపిక చేసిన ఆప్కాబ్ (ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు) పాలకవర్గం
  • గతంలో నాబార్డు సీజీఎంగా బాధ్యతలు నిర్వహించిన రామకృష్ణ
  • ఆప్కాబ్ నూతన ఎండీగా బాధ్యతల స్వీకరణ 
ఆప్కాబ్ (ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు) నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా వి.రామకృష్ణ నియమితులయ్యారు. ఆయన గతంలో నాబార్డులో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆప్కాబ్ పాలకవర్గం నిన్న సమావేశమై కొత్త ఎండీ పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది. అనంతరం రామకృష్ణ ఎంపికైనట్లు పాలకవర్గం ప్రకటించింది. 

తదుపరి రామకృష్ణ ఆప్కాబ్ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎండీ త్రినాథ్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలియజేశారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆప్కాబ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వి. రామకృష్ణ తెలిపారు. 
V Ramakrishna
Apkab
APCOB
Ganni Veeranjaneyulu
NABARD
Andhra Pradesh Cooperative Bank
Trinath Reddy
MD Appointment
Banking
Cooperative Sector

More Telugu News