టెలిగ్రామ్ ఫౌండర్ ఆఫర్.. ఐవీఎఫ్ ఖర్చులు భరిస్తా.. నా డీఎన్‌ఏతో పుట్టే పిల్లలందరూ వారసులే!
- పెళ్లికాని మహిళలకు టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ బంపర్ ఆఫర్
- తన స్పెర్మ్‌తో ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కంటే పూర్తి ఖర్చులు తానే భరిస్తానని ప్రకటన
- ఇప్పటికే స్పెర్మ్ దానం ద్వారా 100 మందికి పైగా పిల్లలకు తండ్రి
- తన 17 బిలియన్ డాలర్ల ఆస్తిలో డీఎన్‌ఏ నిరూపించిన పిల్లలందరికీ సమాన వాటా
- ప్రపంచవ్యాప్త స్పెర్మ్ కొరత, పర్యావరణ కారణాలే తన నిర్ణయానికి ప్రేరణ అని వెల్లడి
మాస్కో: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, రష్యన్ బిలియనీర్ పావెల్ డ్యూరోవ్ (41) ఒక సంచలన ఆఫర్‌తో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తన వీర్య కణాలను ఉపయోగించి గర్భం దాల్చాలనుకునే మహిళలకు ఐవీఎఫ్ (IVF) ఖర్చులను పూర్తిగా తానే భరిస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాదు, అలా పుట్టిన పిల్లలందరికీ తన 17 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) ఆస్తిలో సమాన వాటా ఇస్తానని వాగ్దానం చేశారు.
వివరాల్లోకి వెళితే.. 37 ఏళ్లలోపు వయసున్న అవివాహిత మహిళలు ఈ ఆఫర్‌కు అర్హులు. మాస్కోలోని ఆల్ట్రావిటా క్లినిక్‌లో పావెల్ డ్యూరోవ్ గతంలో దానం చేసిన వీర్యకణాలు నిల్వ ఉన్నాయి. అక్కడికి వచ్చే మహిళలకు అయ్యే ఐవీఎఫ్ ఖర్చులను డ్యూరోవ్ పూర్తిగా భరించనున్నారు. ఇప్పటికే ఆయనకు స్పెర్మ్ డొనేషన్ ద్వారా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు, ముగ్గురు భాగస్వాముల ద్వారా మరో ఆరుగురు సంతానం ఉన్నారు.
గత జులైలో తన టెలిగ్రామ్ పోస్టులో దురోవ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, "నా స్పెర్మ్ దానం వందలాది జంటలకు తల్లిదండ్రులయ్యేందుకు సహాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత తీవ్ర సమస్యగా మారింది. ఈ సమస్యను తగ్గించడంలో నేను నా వంతు పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నాను," అని రాశారు.
లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, "నా డీఎన్‌ఏతో సంబంధం ఉందని నిరూపించుకోగలిగితే, 30 ఏళ్ల తర్వాత నా ఆస్తిలో వారికి వాటా లభిస్తుంది" అని దురోవ్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ‘లీ పాయింట్’ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, "నా పిల్లల మధ్య నేను ఎలాంటి వ్యత్యాసం చూపను" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో తన పిల్లలందరూ ఒకరినొకరు కలుసుకుని, సంబంధాలు ఏర్పరచుకునేందుకు వీలుగా తన డీఎన్‌ఏను ‘ఓపెన్ సోర్స్’ చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
దురోవ్ ఆఫర్‌తో మాస్కోలోని ఆల్ట్రావిటా క్లినిక్‌కు మహిళల నుంచి భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా 37 ఏళ్లలోపు వయసున్న, పెళ్లికాని మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. గత ఏడాది ఈ క్లినిక్ దురోవ్ స్పెర్మ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించగా, ఉన్నత విద్యావంతులు, ఆరోగ్యవంతులైన డజన్ల కొద్దీ మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఆ క్లినిక్‌లోని ఒక మాజీ వైద్యుడు మాట్లాడుతూ, "వచ్చే మహిళలంతా ఎంతో ఆరోగ్యంగా, విద్యావంతులుగా ఉండేవారు. వారు తమ బిడ్డకు ఒక నిర్దిష్టమైన, ఉన్నతమైన వ్యక్తి తండ్రి కావాలని ఆకాంక్షించేవారు" అని తెలిపారు.