Shashank Kanumuri: ఈక్వెస్ట్రియన్ క్రీడాకారుడు శశాంక్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు

Chandrababu Congratulates Equestrian Shashank Kanumuri
  • ఏషియన్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో రజత పతకం సాధించిన శశాంక్ 
  • ఈ క్రీడల్లో పదేళ్ల అనుభవం వుందని సీఎంకు తెలిపిన శశాంక్
  • భవిష్యత్తులో శశాంక్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన చంద్రబాబు
భీమవరంకు చెందిన ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) క్రీడాకారుడు శశాంక్ కనుమూరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. థాయ్ పోలో క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో భారత జట్టు తరపున శశాంక్ పాల్గొని రజత పతకం సాధించారు.

ఈ నేపథ్యంలో శశాంక్ నిన్న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. గుర్రపు స్వారీ చేస్తూ హర్డిల్స్ దాటే ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ క్రీడల్లో తనకు పదేళ్ల అనుభవం ఉందని శశాంక్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 
Shashank Kanumuri
Chandrababu Naidu
Equestrian
Eventing Asian Championship 2025
Thailand Polo Club
Silver Medal
Andhra Pradesh
Bhimavaram
Horse Riding

More Telugu News