వుడా మాజీ చీఫ్ ప్రదీప్ కుమార్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

  • ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 2018లో ప్రదీప్ కుమార్‌పై ఏసీబీ కేసు 
  • ప్రదీప్ కుమార్ ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించిన ఈడీ అధికారులు
  • హైదరాబాద్‌లో ఉన్న 1.09కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ పసుపర్తి ప్రదీప్ కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. ఆయన ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రదీప్ కుమార్‌పై 2018లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ కేసులో ప్రదీప్ కుమార్, ఆయన అర్ధాంగి పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు, బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్ చేసింది. 


More Telugu News