Mallu Bhatti Vikramarka: హాస్టల్ విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఉప ముఖ్యమంత్రి

Deputy CM Mallu Bhatti Vikramarka Dines With Hostel Students
  • ఖమ్మంలో గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి
  • వసతి సౌకర్యాలు, బోధన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించిన మల్లు భట్టి విక్రమార్క
  • విద్య, వైద్యం, సంక్షేమ రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ధతో ముందుకు సాగుతోందని వెల్లడి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం జిల్లాలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ రోజు ఆయన జిల్లాలోని వైరా నియోజకవర్గం, కొనిజర్ల మండలంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు.

ఆయన వసతి సౌకర్యాలు, బోధన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Mallu Bhatti Vikramarka
Telangana Deputy CM
Khammam
Telangana Tribal Welfare Girls Gurukula Degree College

More Telugu News