అమెజాన్ కీలక నిర్ణయం.. ఉత్తర కొరియా వారికి ఉద్యోగ నిషేధం
- ఉత్తర కొరియా వారిని నియామకాల్లో నిషేధించాలని అమెజాన్ నిర్ణయం
- ఉత్తర కొరియా నుంచి వచ్చే దరఖాస్తులను బ్లాక్ చేసిన అమెజాన్
- ఆర్థిక దోపిడీ, డేటా ఉల్లంఘనకు దారి తీస్తాయని ఆందోళన
ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగ నియామకాల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నియంత కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా పౌరులను ఉద్యోగ నియామకాల్లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. నియంత కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రజల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తులను అమెజాన్ బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని అమెజాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ స్మిత్ లింక్డిన్ పోస్టు ద్వారా వెల్లడించారు.
అమెరికా సహా ప్రపంచ దేశాల్లో 'రిమోట్' ఐటీ ఉద్యోగాలను పొందేందుకు ఉత్తర కొరియా వాసులు ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఉత్తర కొరియా నుంచి అమెజాన్ సంస్థకు వచ్చిన దరఖాస్తులు 30 శాతం పెరిగాయని స్టీఫెన్ తెలిపారు. ఇలాంటి వారు ల్యాప్‌టాప్ ఫార్మ్స్‌పై ఆధారపడతారని ఆయన హెచ్చరించారు. ల్యాప్‌టాప్ ఫార్మ్స్ అంటే కంప్యూటర్లు అమెరికాలో ఉన్నట్టుగా చూపించి, వాటిని విదేశాల నుంచి ఆపరేట్ చేయడం.
ఇలా ఉంటే ఉద్యోగుల ఫోన్ నెంబర్లు, విద్యార్హతలు వంటి వాస్తవ వివరాలు తెలుసుకోవడం కష్టమవుతుందని ఆయన తెలిపారు. ఈ సమస్యను అమెజాన్ ఒక్కటే ఎదుర్కోవడం లేదని, అదే సమయంలో ఈ సమస్య కేవలం ఉద్యోగాలకే పరిమితం కావడం లేదని స్టీఫెన్ అన్నారు. ఇది ఆర్థిక దోపిడీ, డేటా ఉల్లంఘనలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల ఆరిజోనాలో ల్యాప్‌టాప్ ఫార్మ్స్ నిర్వహిస్తూ ఉత్తర కొరియా ఐటీ ఉద్యోగులకు సహకరించిన ఒక మహిళకు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ వ్యవహారంలో ఆపరేటర్, ఉత్తర కొరియా ప్రభుత్వానికి 17 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరిందని అధికారులు దర్యాప్తులో గుర్తించారు.
కాగా, కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిధుల కోసం తన పౌరులను ఇతర దేశాల్లో ఉద్యోగాల్లో చొప్పించి, వారి వేతనం సొమ్మును అణు కార్యక్రమాలకు మళ్లిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఉత్తర కొరియా వాసులు అమెరికా వారిగా నటిస్తూ ఉద్యోగాలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దొంగిలించిన లేదా తప్పుడు ఐడీలతో ఈ ఉద్యోగాలు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ఉత్తర కొరియా ఐటీ ఉద్యోగుల కుంభకోణం ద్వారా 2018 నుంచి ఆ దేశానికి ప్రతి సంవత్సరం 250 నుంచి 600 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనాలు ఉన్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ) అందుబాటులోకి వచ్చాక ఉత్తర కొరియా వాసుల మోసాలు మరింత పెరిగాయని చెబుతున్నారు.
ఉత్తర కొరియాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను చైనా, రష్యాలో ఉంచి ఏఐ సాయంతో ఒక మంచి కంపెనీలో అనుభవం ఉన్నట్లు బయోడేటా తయారు చేస్తారని, దొంగిలించిన లేదా తప్పుడు అమెరికన్ ఐడీలతో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తారని ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులపై అధ్యయనం చేస్తున్న గూగుల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ లీడర్ మిషెల్ బార్న్ హార్ట్ తెలిపారు. వీరికి కొంతమంది ఫెసిలిటేటర్లు సహకరిస్తారని, కొందరు డమ్మీ ఐటీ కంపెనీలు, వెబ్ డిజైన్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఇవన్నీ నిజమైనవేనని నమ్మి ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా వారిని నియమించుకుంటున్నట్లు తెలిపారు.