Kuldeep Singh Sengar: ఉన్నావ్ అత్యాచార కేసు... కీలక ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

Kuldeep Singh Sengar Sentence Suspended in Unnao Rape Case by Delhi High Court
  • కుల్దీప్ సింగ్‌కు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును నిలిపివేసిన హైకోర్టు
  • కుల్దీప్ సింగ్ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో శిక్షను సస్పెండ్ చేసినట్లు వెల్లడి
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం
ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించిన కుల్దీప్ సింగ్ సెంగర్‌కు విధించిన జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిలిపివేసింది.

ఉన్నావ్ అత్యాచార కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ 2019లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కుల్దీప్ సింగ్ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో అతడి శిక్షను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.

జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం కుల్దీప్ సింగ్‌ను బెయిల్‌పై విడుదల చేసింది. ఇందుకోసం రూ.15 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది. నిందితుడు బాధితురాలి ఇంటి పరిధిలోకి వెళ్లకూడదని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరింపులకు పాల్పడకూడదని షరతు విధించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని తెలిపింది.

పెండింగ్‌లో ఉన్న పిటిషన్ విచారణలో అతడు దోషి అని తేలితే పూర్తి శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. 2017లో కుల్దీప్ సింగ్ యూపీలోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. 2019న ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతనిపై ఉన్న కేసులను ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు.
Kuldeep Singh Sengar
Unnao rape case
Delhi High Court
Justice Subramaniam Prasad
Justice Harish Vaidyanathan Shankar

More Telugu News